ప్రతిభ ఉన్నా.. పేదిరకంతో ఎందరో యువకులు చదువు, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. దిశానిర్దేశం చేసేవారు, ప్రోత్సాహం లేక మాణిక్యాలు మట్టిలో కలిసిపో తున్నాయి. ఇటువంటి మాణిక్యాలను వెన్ను తడితే రాకెట్ స్పీడ్ తో ముందుకు దూసుకుపోతారు. సరిగ్గా ఈ నిజాన్ని జీర్ణించుకున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి ఎందరో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. నిరుద్యోగులకు ఆత్మ స్టైర్యం కల్పిస్తూ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. వారి జీవితాలకు బంగారు బాటల వేస్తూ సమాజం నుంచి ఆత్మీయ సత్కారాలను పొందుతున్నారు.
ప్రోత్సాహం లేక చదువులకు దూరం
కరువు.. పేదరికం.. నిరక్షరాస్యత.. వలసలకు కేరాఫ్ పాల మూరు జిల్లా. తెలంగాణలోనే విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో చదవాలని ఆసక్తి ఉన్నా సరైన ప్రోత్సాహం లేక చాలా మంది యువత చదవులకు దూర మవుతున్నారు. ప్రతిభ ఉన్నా పోటీ పరీక్షల్లో మేలకువలు తెలియక రాణించలేకపోతున్నారు. పాలకులు, రాజకీయ నాయకులు, అధికారులు ప్రతిసారి మైకులు పట్టుకొని ఉపన్యాసాలు ఇస్తారు. కానీ వేదికలు దిగారా వారికి ఏవీ గుర్తుండవు. ఓ పోలీస్ అధికారి మాత్రం ఇందుకు భిన్నంగా సమాజానికి తనవంతు సేవ చేస్తూ ముందుకు పోతున్నారు. ఆయన మధుకర్ స్వామి. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు సూచించే విధంగా ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. వారికి ఒక మార్గం చూపుతు న్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మధుకర్ స్వామి మహ బూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తి, జిల్లా కేంద్రంలలో సీఐగా విధులు నిర్వహించారు.
వ్యక్తిగత కృషితో..
ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, చదివిన వారికి సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం మరోవైపు.. వెరసి యువతలో నిరాశ నిస్పృహ ఉన్నాయి. దీనిని గమనించిన మధుకర్ స్వామి.. 2001లో హైదరాబాద్ కేంద్రంగా పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ను స్థాపించారు. తనతోపాటు మరో ఆరుగురు సభ్యులను ఇందు లో చేర్చుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2003లో కొల్లాపూర్ 120 మందికి ఉచితంగా శిక్షణ ఇప్పించారు. ఆర్టీసీతో మాట్లాడి సెక్యూరిటీ గార్డులు గా నియమింపజేశారు. మరి కొంతమంది కానిస్టేబు ళ్లుగా ఎంపికయ్యారు. 2005 నుంచి ఇప్పటి వరకు మానసిక విశ్లేషకులు, వివిధ శిక్షణా సంస్థల్లో బోధించే వారితో కలిసి విద్యార్థులకు, నిరుద్యో గులు, యువతకు శిక్షణ ఇప్పించారు. 2006లో వనపర్తిలో 120 మందికి కాని స్టేబుళ్ల ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వగా 80 మంది ఎంపికయ్యారు. ఆరుగురు ఎస్ఎలు అయ్యారు. మరికొంతమంది. వివిధ ఉద్యో గాల్లో స్థిరపడ్డారని మధుకర్ స్వామి తెలిపారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు వర్క్ షాపులు, ఉపాధ్యాయ శిక్షణలు, రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలపై అవగా హన కోసం వసంతం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తనవంతు గా పేద, తెలివైన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఉచిత శిక్షణా కార్యక్రమాలు, సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తున్నామని మధుకర్ స్వామి తెలిపారు. పట్టణ ప్రాంత విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు తెలివిపరులని కేవలం వారికి సరైనా గైడెన్స్ లేక లక్ష్యం సాధించలేకపోతున్నారని తెలిపారు. తన క్యాంపులో శిక్షణ పొందుతున్న వారందరికి ఉద్యోగాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా పోలీస్ ఉద్యోగంలో చేరాలనుకునే వారి కోసం గత రెండు నెలల నుంచి వనపర్తిలో మరోసారి ఉచిత శిక్షణా శిబిరం ప్రారం భించారు. ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఎవ - రైనా వెళ్లవచ్చు.. కాలక్షేపం చేయవచ్చు అనే తరహాలో కాకుండా ఓ క్రమశిక్షణ తో ఇక్కడ శిక్షణ కొనసాగుతుంది. పత్రి కా ప్రకటన ఇవ్వటంతో దాదాపు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అందులో మెరిట్ ప్రకారం, రోస్టర్ విధానాన్ని పాటించి పకడ్బందిగా 150 మందిని ఎంపిక చేశారు. ఇందులో అందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారినే తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కు అవకాశం లేదు, ప్రత్యేకత ఏమిటంటే ఈ సారి 35 మంది అమ్మాయిలు కూడా శిక్షణకు ఎంపికయ్యారు. 150 మంది విద్యా ర్థులకు వనపర్తి సమీపంలో గాయత్రీ బీఈడీ కళాశాలలో వీరికి రెండు నెలల నుంచి నిర్విరామంగా శిక్షణ ఇస్తున్నారు. అమ్మాయిలకు ప్రత్యేకంగా వసతి కల్పించారు. డ్రస్, షూ పంపిణీ చేసి డ్రస్ కోడ్ అమలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ రకాల శిక్షణలు ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం యోగా, హైజంప్, లాంగ్ జంప్ వంటి శారీరక దారుఢ్యమైన ప్రాక్టీస్ చేయిస్తు న్నారు. 9 గంటల నుంచి సాయంత్రం వరకు థియరీ క్లాస్లు నడుస్తున్నాయి. స్థానికంగా ఉండే వారే కాకుండా వివిధ సబ్జెక్టులకు నైపుణ్యులైన ఫ్యాక్టరీలను హైదరాబాద్ నుంచి రప్పించి తర్పీదును ఇప్పిస్తున్నారు. పోటీ పరీక్షల మేలకువలు నేర్పుతూ ప్రత్యేక శిక్షణ అమలు చేస్తున్నారు. తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు థియరీ క్లాస్లు నడుస్తున్నాయి. స్థానికంగా ఉండే వారే కాకుండా వివిధ సబ్జెక్టులకు నైపుణ్యులైన ఫ్యాకల్టీలను హైదరాబాద్ నుంచి రప్పించి తర్ఫీదు ఇప్పిస్తున్నారు. పోటీ పరీక్షల మెలకువలు నేర్పుతూ ప్రత్యేక శిక్షణ అమలు చేస్తున్నారు. వారంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీస్ అధికారిగా తనకున్న అనుభవంతో పాటు పోటీ పరీక్షలకు తగ్గట్లు గైడెన్సు ఇస్తున్నా రు. శిక్షణ పొందుతున్న వారిలో పదవ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యూయేట్స్ ఫార్మీసీ పూర్తి చేసిన వారూ ఉన్నారు. కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలకే కాకుండా గ్రూప్-1, గ్రూప్-2 స్థాయిల్లో శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని యువ కులు అభిప్రాయపడుతు న్నారు. ప్రణాళిక ప్రకారం పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో చక్కగా మార్గదర్శనం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము ఉద్యోగాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉచిత శిక్షణ కేంద్రం పెట్టడం తమకు వరమని అంటున్నారు.
ఒక్కొక్కరికి 40 నుంచి 50 వేల ఖర్చు
45 రోజుల పాటు సాగే ఈ శిక్షణలో 150 మందికి అన్ని ఉచితంగానే అందజేస్తున్నారు. మంచి పౌషికాహారం అంది స్తున్నారు. ఉదయం మొలకలు, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి భోజనం పెడుతున్నారు. సీఐ ఎప్పటికప్పుడు మెనును ఫోన్ ద్వారా తెలియజేస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని వసతులు కసల్పించారు. ఈ కోచిం గను ప్రైవేట్ గా అద్దె గదిలో ఉండి తీసుకుంటే ఒక్కొక్కరికి 40నుంచి 50 వేల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అయినా ఇంత ప్రశాంత వాతావణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ పొందటం సాధ్యం కాదని అంటు న్నారు. హైదరాబాద్ లో విధులు నిర్వహించే మధు కరస్వామి ఆదివారం, సెలవు దినాల్లో శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో గడిపి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. 2006లో నిర్వ హించిన శిక్షణలో కానిస్టేబుళ్లుగా ఎంపికై ఉద్యోగం చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రత్యేక అనుమతి తీసుకొని ఇక్కడ వాలంటీర్లుగా పని చేస్తున్నారు. వీరు ప్రస్తుతం శిక్షణ పొందు తున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గతంలో తాము ఎలా ఉద్యోగం సంపాదించామో వివరించటమే కాకుండా 150 మంది యువకులను పర్యవేక్షిస్తున్నారు. తమకు ఇక్కడ పని చేసి మధుకర్ స్వామిసార్ రుణం తీర్చుకునే అవకాశం దొరకటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్లు, ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న యువకులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అందరూ పోటీ పరీక్షల్లో నెగ్గుతారని అధ్యాపకులు చెబుతున్నారు. తాము చదువుకునే రోజుల్లో ఇలాంటి ఉచిత శిక్షణలు ఉంటే మంచి స్థానంలో ఉండేవా రమని అంటున్నారు.
అనేక సేవా కార్యక్రమాల నిర్వహణ
యువతి, యువకులకు కేవలం పోటీ పరీక్షల్లో శిక్షణ ఇవ్వ టమే కాకుండా సామాజిక బాధ్యతను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఆదివారం సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. హరితహారం స్వచ్ఛభారత్ వంటి కార్యక్ర మాలను వనపర్తి పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రం చేసి స్థానికుల మన్ననలు పొందుతున్నారు. ఇక్కడ గతంలో పని చేసిన అధికారులు తమకున్న సేవాదృక్పదంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్ట డం అభినందనీయమని స్థానిక ప్రజాప్రతినిధులు కొనియా డుతున్నారు. ఇలాంటి శిక్షణలు ఇతరులకు స్పూర్తిదాయ కంగా నిలుస్తాయని అంటున్నారు.