కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీపీ సజ్జనార్ సూచన
జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులకు మొదటి స్థానం ఉందని, అదే స్ఫూర్తితో కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సైబరాబాద్ సీపీ సజనార్ సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సహకారంతో నిర్వహించిన ఉచిత శిక్షణలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన 280 మంది అభ్యర్థులకు రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరి యంలో అభినందన సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. 18వేల ఎహ్, కానిస్టేబుళ్ల నియామకాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవా దాలు తెలియజేస్తున్నానన్నారు. శంషాబాద్ జోన్ పోలీసుల సమష్టి కృషితో 2018 జూలైలో ప్రారంభించిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో రెండువేల మంది అభ్యర్థులు పాల్గొన్నారని తెలిపారు. శౌర్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నరేశ్ మిత్ర బృందం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిందన్నారు. ఎంపికైన 280 మందిలో 104 మంది మహిళలు ఉండడం సంతోషకర మన్నారు. తమ వద్దకు వచ్చే ప్రజల సమస్యలను పోలీసులు నిస్వార్థంగా పరిష్కరించాలన్నారు. తల్లిదండ్రులను మర్చి పోవద్దని, చదువు చెప్పిన గురువులను ఎప్పటికీ గుర్తుంచు కోవాలని చెప్పారు. శిక్షణ కాలంలో సైబర్ క్రైమ్స్, ఎకనా మిక్స్ అఫెన్సెస్ తో పాటు రైటర్ డ్యూటీలపై శ్రద్ధ చూపిం చాలని పేర్కొన్నారు. కష్టపడితే గుర్తింపు ఉంటుందని, ఫిట్ నెస్ గా ఉండేలా చూసుకోవాలన్నారు. పోలీసు శిక్షణలో రాజేంద్రనగర్, బాచుపల్లి ఇన్ స్పెక్టర్లు జి.సురేశ్, జగదీశ్వర్ల కృషి ఎక్కువగా ఉందన్నారు.
పది కుటుంబాల నుంచి ఇద్దరేసి చొప్పున.....
శంషాబాద్ మండలం, రాళ్లగూడకు చెందిన సెంట్రింగ్ మేస్త్రీ ఎం. శంకర్ కుమారుడు రమేశ్, కుమార్తె ఎం.రజితకు కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. వీరితో పాటు భవానీ కాలనీకి చెందిన దేవేంద్రమ్మ కుమార్తెలు మౌనిక, మనీషా, మైలార్ దేవిపల్లి శ్రీరాం కాలనీకి చెందిన నర్సింహులు కుమారుడు నవీన్ కుమార్, నీలి అరుణ్, కాలాపత్తర్ కు చెంది న ఫరానా బేగం కుమారులు కలీం పాషా, కరీంపాషా, బహదూర్‌పురాకు చెందిన విశ్రాంత ఇన్ స్పెక్టర్ మస్తాన్ వలీ కుమారులు షేక్ జునైద్ జాఫర్, షేక్ హీనా, శివరాంపల్లికి చెందిన విశ్రాంత ఎస్ఎ దాసరి రమేశ్ కుమార్తె ఉషా, కుమారుడు ప్రశాంత్, చేవెళ్ల మండలం పామెల గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు మాణిక్యం కుమారుడు నవీన్ కుమార్, కుమార్తె సంపూర్ణ, మొయినాబాద్ మండలం కుత్బుద్దీ గూడ గ్రామానికి చెందిన జంగయ్య కుమారులు రాజేశ్, శేఖర్, మహేశ్వరం మండలం దుబ్బచర్లకు చెందిన శ్రీశైలం కుమార్తెలు ఆర్.సంధ్య, ఆర్.పావని, శంషాబాద్ రామాంజపూర్‌కు చెందిన సి. గోపాల్ కుమార్తెలు సంధ్య, దివ్యకు కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. వీరిని సైబరా బాద్ సీపీ సన్మానించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ, శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ డీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీలు కె.అశోక్ చక్రవర్తి, వెంకట్ రెడ్డి, అశోక్, వెంకటేశ్వర్లు, ఇన్ స్పెక్టర్లు, ఎస్ఏలు పాల్గొన్నారు.
అధికారుల కృషి అభినందనీయం
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి కాని స్టేబుల్ ఉద్యోగాలు వచ్చేటట్లు కృషి చేసిన సైబరాబాద్ కమిషనరేట్ అధికారుల కృషి అభినందనీయమని రంగారెడ్డి జిల్లా ఇంచార్జి కలెక్టర్ హరీష్ అన్నారు. ఉద్యోగం పొందిన వారు అదృష్టవంతులని, వారిపై బాధ్యత పెరుగుతుంద న్నారు. శివరాంపల్లికి చెందిన రేణుక కూతుళ్లు కె.మౌనిక, ప్రియాంక, రాధికకు కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. వీరి చిన్నప్పుడే తండ్రి ఇంటి నుంచి వెళ్లి పోగా తల్లి నేచర్ క్యూర్ ఆస్పత్రిలో దినసరి కార్మికురాలిగా పనిచేస్తూ ముగ్గురినీ చదివించింది. పెద్ద కుమార్తె మౌనిక ఎమ్మెస్సీ జువాలజీ, రెండో కుమార్తె ప్రియాంక బీకాం, మూడో కుమార్తె రాధిక బీఏ చదివారు. ముగ్గురు కుమార్తెలకు ఉద్యోగాలు రావడంతో తల్లి కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి.
తోటి వారికి చేయూతనందించాలి
కానిస్టేబుల్ ఉద్యోగం చిన్నదేమీ కాదా ని, ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగ జీవితం ప్రారం భించి ఇన్ స్పెక్టర్‌ను అ య్యాను. పేద కుటుం బం నుంచి వచ్చిన నేను 14 మందిని పైకి తీసు కోచ్చాను. అదే స్ఫూర్తితో మీరూ పనిచేయాలి.
- జగదీశ్వర్, బాచుపల్లి ఇన్ స్పెక్టర్
280 కుటుంబాల్లో వెలుగులు
సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కృషితో 280 కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. అభ్యర్థులు ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్తులో ఉన్నత స్థా నాలకు ఎదిగి రాణించాలి.