అమరుల త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలి

అమరుల త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలి


ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం



విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను స్మరించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా సేవ లను స్మరిస్తూ సైబరాబాద్ కమిషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన నివాళులర్పించా రు. రక్తదాన శిబిరం, ఓపెన్ హౌజ్, విద్యారులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. డీసీపీలు వెంకటేశ్వరరావు, రోహిణీ ప్రియదర్శిని, ఎస్ఎం విజయ్ కుమార్. ప్రకాష్ రెడ్డి, అనసూయ, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని సదరన్ సెక్టార్ సీఆర్‌పీఎఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో సీఆర్పీఎఫ్ ఐజీ ఎమ్ ఆర్ నాయక్ పాల్గొన్నారు. హైదర్ గూడ చౌరస్తాలో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి స్థానిక నాయకులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజేంద్ర నగర్ ఇన్ స్పెక్టర్ సురేశ్, ఎస్సైలు దామోదర్, ఎన్.రాములు, బాల్ రాజ్, సిహెచ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


అమరుల త్యాగాలే స్పూర్తి


పోలీసు అమరుల దినోత్సవంలో హోంమంత్రిపోలీసు అమరుల త్యాగాలే స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామనినేర రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు శలు కృషి చేస్తున్నామని సూంమంత్రి మహమూద్ అన్నారు. పోలీసు అమరువీరుల దినోత్సవ గోషామహల్ పోలీసు మైదానంలో ఘనంగా జరిగాయికార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూపోలీసులు విధి నిర్వహణలో శక్తివంచన లేకుండా న్నారన్నారు. వారి సేవలు చిరస్మరణీయమనిఎలాంటి అలజడులు రాకుండా పకడ్బందీగా న్నారని ప్రశంసించారు. డీజీపీ మహేందర్ మాట్లాడుతూ.. 1959లో చైనాభారత్ సరిహద్దులో దురాక్రమణను అడ్డుకునేందుకు ప్రాణాలర్పించిన జవాన్ల అమరత్వానికి చిహ్నంగా ఏటా పోలీసు దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.


పోలీసు అమరులకు సీఎం కేసీఆర్ నివాళి


శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసుల నిబద్దత, దేశ రక్షణ కోసం సరిహ దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోనిదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొ న్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణా లు కూడా అర్పిస్తున్నారని, ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉండిపోతారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.


                                                                                              - పొన్నాల ప్రేమ్ కుమార్