ప్రజాసేవయే జీవితాశయం

ప్రతాపగిరి కృష్ణవేణి, ప్రతాపగిరి పుల్లయ్యలకు 1966వ సంవత్సరం ఆగస్టు 27న ప్రతాపగిరి వెంకటరమణ అదిలా బాద్ పట్టణంలో జన్మించారు. స్వర్గీయ ప్రతాపగిరి అటవీశాఖ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయ సతీమణి స్వర్గీయ కృష్ణవేణి గృహిణిగా తన బాధ్యతలను నిర్వహించారు. ప్రతాపగిరి ప్రాథమిక విద్యను అదిలాబాద్, హైదరాబాద్ లోని ఉస్మానియా కళాశాల నుండి, ఇంటర్ కర్నూల్ నుండి పూర్తి చేశారు. తన బీకాం డిగ్రీని ప్రభుత్వ కళాశాల అదిలాబాద్లో 1985 సంవత్సరం నుండి 1988 సంవత్సరం వరకు చదివి పట్టాను పొందారు. తదుపరి ఉన్న త విద్యను ఎంకాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు. తన మొదటి ఉద్యోగం ఎస్సైగా 1991వ సంవ త్సరంలో షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పదవీ బాధ్య తలను స్వీకరించారు. ఆయన ఎస్సైగా పలు కీలకమైన పద వులు నిర్వహించారు. దీనిలో భాగంగా ముఖ్యమైనది టాస్క్ ఫోర్స్ విభాగం. 2005వ సంవత్సరం నవంబర్ 2వ తేదీన ఆయనకు ఇన్ స్పెక్టర్గా పదోన్నతి లభించింది. ఇన్ స్పెక్టర్గా ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో, ఎస్ హెచ్ఓగా ఛత్రినాక, ముషీరాబాద్, అంబర్ పేట, జడ్చర్లలో చాలా చురుకుగా అతీ కీలకమైన విషయాలను చేధించారు. స్పెషల్ బ్రాంచ్ అడ్మిని స్టేషన్ విభాగంలో సాఫ్ట్ వేర్ విభాగంలో నూతనంగా విధుల ల్లోకి వచ్చిన వారికి శిక్షణనివ్వడంలో తన వంతు సహాయం చేశారు. చాలా సున్నితమైన విషయాలను చేధించటం అలాగే “మ్యాన్ డ్రాక్స్” (ఎన్డీపీఎస్) బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కేసు, మరియు “లిథాల్” ఆయుధాలు, సందీప్ కటారియా, ఉత్తర భారతదేశం ముఠాలను పట్టు కోవడం, నకిలీ స్టాంప్ పేపర్స్ కేసు, నకిలీ ఇందిరా వికాస్ ప్యాట్రో, గాంజా నకిలీ సర్టిఫికేట్ కేసులను వెలుగులోకి తేవటం ఆయన ప్రత్యేకత. ఆయన ఇన్ స్పెక్టర్గా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిం చేట్టప్పుడు పోలీస్ స్టేషన్ నూతన సముదాయాన్ని నిర్మించ టానికి చాలా కృషి చేశారు. 2010వ సంవత్సరంలో కమ్యూనల్ రైట్స్ ను అడ్డు కోవడం శాంతి భద్రతలను కాపాడటం లాంటివి ఎంతో శ్రద్దగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాటి కమిషనర్ చేత కమాండేషన్ ఉత్తరాన్ని సంపాదిం చారు.



ఆయన ఎస్ హెచ్ఓగా జడ్చర్లలో విధులు నిర్వహించేట ప్పడు సున్నితమైన మర్డర్ కేసులు, హైవే దొంగతనాలు, గ్యాంగ్ రేప్ కేసులు చేధించి దొంగలకు కఠినమైన శిక్షలు పడేలా చేశారు. 2014వ సంవత్సరంలో అంబర్ పేట పోలీస్ స్టేషన్లో ఇన్ స్పెక్టర్గా ఉన్న సమయంలో హైదరాబాద్ కమిషనర్ చేత కమాండేసన్లు పుచ్చుకున్నారు. 2010 సంవత్సరంలో అన్ని విభాగాలలో తెలివిగా చురుకుగా పని చేసినందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవా పతకం, 2018వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చేత ఉత్తమ సేవా పతకం, 106 క్యాష్ రివార్డ్స్, 162 జీఎస్ఈలు, ఒక అడ్వాన్స్ ఇంక్రిమెంట్ పొం దారు. ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. 1994వ సంవత్సరంలో మాధవీలతతో వివాహం ఘనంగా జరిగింది. ఆమె పీహెచ్డీ, ఎంఫిల్, ఎంబీఏ, ఎంఎస్ఈ డిగ్రీలు సంపాదించి ప్రస్తుతం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోని సరోజినీనాయుడు వనితా మహా విద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు సతానం. మొదటి సంతానం ప్రతాపగిరి సాయిప్రనవ్. నెల్లూరులోని “విట్”లో బీటెక్ చదివి సాఫ్ట్ ఇంజనీయర్గా పని చేస్తున్నారు. రెండో సంతానం ప్రతాపగిరి సాయి యసశ్వి. చైతన్య కళా శాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తు తం ప్రతాపగిరి వెంకటరమణ సికింద్రాబాద్ నార్త్ జోన్లో సహాయ పోలీస్ కమిషనర్గా (ట్రాఫిక్ విభాగం) విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన జీవితంలో ఎన్నో ఉన్నతమైన పదవులను చేపట్టాలని ఆశిస్తూ.. మీ “పోలీస్ వ్యూ”.


                                                                                             - దూసరి అనంతమోహన్